Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మంలో కొవ్వొత్తులతో ర్యాలీ
నవతెలంగాణ- ఖమ్మం
ఉత్తరప్రదేశ్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అన్నదాతలను కారుతో ఢకొీట్టించి నలుగురి చావుకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుణ్ని వెంటనే అరెస్టు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావుచ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. అమరులైన రైతులను స్మరించుకుంటూ సీఐటీయూ, తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఖమ్మం జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటన జరిగి వారం గడిచినప్పటికీ బాధ్యులను అరెస్ట్ చేయడంలో ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిందితులను రక్షించే చర్యకు ఆ సర్కారు పూనుకున్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వ వైఖరిపై సుప్రీం కోర్టుకూడా తీవ్రంగా ఆక్షేపించిన విషయాన్ని గుర్తు చేశారు. లఖింపూర్ ఘటన పై ప్రధాని నరేంద్రమోడీ మౌనం వీడాలనీ, నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను, కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, సంఘాల నాయకులు ఎర్రా శ్రీకాంత్, ఎస్కె.సాహెబ్, నర్ర రమేష్ పాల్గొన్నారు.
వేంసూరు : ఆదివారం రాత్రి మండల పరిధిలోని శంభునీగూడెంలో సిపిఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అరవపల్లి జగన్మోహన్ రావు, నాయకులు అర్వపల్లి నరసింహారావు, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపిటిసి జగన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.