Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ సివిల్ జడ్జి జావేద్ పాషా
నవతెలంగాణ- ఖమ్మం లీగల్
మానసిక అనారోగ్యం అనేది నయం చేయదగినదేనని జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా అన్నారు. ఆదివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పోలేపల్లిలోని మదర్ థెరీసా ఆశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సౌజన్యంతో ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మానసిక అనారోగ్యం అనేది మందులతో నయం చేయదగినది అని కొంచెం శ్రద్ధ తీసుకొని మందులు ఇస్తే వారు త్వరగానే కోలుకుంటారని న్యాయమూర్తి తెలిపారు. దీనికి భిన్నంగా పుట్టుకతోనే వచ్చే మానసిక రుగ్మత నయం చేయలేనిదని, వీరిని సంరక్షించాలని ఆయన సూచించారు. వైద్య శిబిరంలో భాగంగా న్యాయమూర్తి కూడా మానసిక రోగులకు సేవలను అందించారు. వైద్య పరీక్షల నిమిత్తం తమ గదుల నుంచి బయటికి వచ్చే మానసిక అనారోగ్యాలకు న్యాయమూర్తి మాస్కులు కట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు తమ శిబిరంలో ఉన్నవారికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించిన అప్పటికీ వారికి సర్టిఫికెట్లు రాలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకొని రాగా స్పందించిన న్యాయమూర్తి వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. అతి త్వరలో ఆశ్రమంలోని అందరికీ కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ స్వప్న వైద్య సేవలు అందించారు. అనంతరం న్యాయమూర్తి అన్నం సేవ ఫౌండేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక అనారోగ్య లకు వారి హక్కులను కార్యక్రమంలో సంస్థ ప్యానెల్ న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ, న్యాయసేవా సంస్థ సభ్యుడు కడివెండి వేణుగోపాల్, అన్నం శ్రీనివాసరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైమావతి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.