Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- నేలకొండపల్లి
చేగువేరా స్ఫూర్తితో ప్రజా సమస్యలపై యువత ఉద్యమించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 54 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరుద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించడంమే చేగువేరాకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఇంటూరి అశోక్, మండల కార్యదర్శి రాసాల నవీన్, నాయకులు యలమద్ది లెనిన్, రాకేష్, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బోనకల్ : చేగువీరాను ఆదర్శంగా తీసుకొని సమాజ మార్పు కోసం యువత కృషి చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు గుగులోతు పంతు కోరారు. రావినూతల గ్రామంలో డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చేగువీర 54వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత చేగువీరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నంచర్ల గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుగులోతు పంతులు, రావినూతల మాజీ ఉప సర్పంచ్ గండు సైదులు మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ ఇన్చార్జ్ ఎర్రగాని నాగరాజు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు బానోతు గోపి, డివైఎఫ్ఐ మాజీ నాయకులు గుగులోతు నరేష్, ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోతు శారద, యూత్ నాయకులు జొనిబోయిన గురవయ్య, కొమ్మినేని పిచ్చయ్య, మరీదు వెంకటేష్, నాగేంద్రబాబు, పవన్ కుమార్, కందిమల్ల అచ్యుతరావు, భానోత్ నాగేశ్వరరావు, బానోతు మాన్యనాయక్, బానోత్ స్వామి, గుగులోతు సైదులు, ధరావత్ నరేష్, ధరావత్ జగన్, బానోతు వీరమ్మ, గుగులోతు లక్ష్మి, బానోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.