Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వర్ధంతి సభలో సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-ముదిగొండ
రాయల కమలమ్మ సిపిఐ(ఎం)కు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు సతీమణి రాయల కమలమ్మ ప్రధమ వర్ధంతి సభ వెంకటాపురం గ్రామంలో ఆదివారం నిర్వహించారు. తమ్మినేనితో పాటు, రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్‌లు హాజరై రాయల కమలమ్మ చిత్రపటానికి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ రాయల కమలమ్మ చిన్ననాటి నుండి పార్టీకి అనేక సేవలందించిందన్నారు. పార్టీకి అండదండగా ఉంటూ ఉద్యమ నాయకులకు కార్యకర్తలకు కడుపునిండా భోజనం పెట్టి ఆకలి తీర్చిన మహా తల్లి కమలమ్మన్నారు. కమలమ్మ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. రాయల వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు నాగేశ్వరరావుతో వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శి బండి పద్మ, మాచర్ల భారతి, సిపిఎం మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్, సొసైటీ వైస్ చైర్మన్ బట్టు పురుషోత్తం, సిపిఎం నాయకులు కందుల భాస్కరరావు, మందరపు వెంకన్న, మర్లపాటి వెంకటేశ్వరరావు, పాలవాయి పాండురంగారావు, మందరపు పద్మ, కొల్లేటి ఉపేందర్, పి రాంబాబు, తేజావత్ వెంకటేశ్వర్లు, చింతకాయల రామారావు, ఇరుకు నాగేశ్వరరావు, వేల్పుల భద్రయ్య, టిఎస్ కళ్యాణ్, చిరుమర్రి, ముదిగొండ ఎంపీటీసీలు కోలేటి అరుణ, బలంతు జయమ్మ, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు, వెంకటాపురం, పమ్మి, మేడేపల్లి సర్పంచ్‌లు కోటి అనంతరాములు, కొండమీద సువార్తరఘుపతి, సామినేని రమేష్, రాయల కమలమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.