Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఖాళీ బిందెలతో మహిళల
రాస్తారోకో
అ సమస్యను పట్టించుకోని
పంచాయతీ కార్యదర్శి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని పెద్దతండా పంచాయతీ పరిధిలోని నాయుడుపేట కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై నాయుడుపేట వద్ద మహిళలు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ ఖమ్మం కార్పొరేషన్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నాయుడుపేట గ్రామంలో గత నాలుగు నెలలుగా ప్రజలు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని గురించి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి గ్రామ సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలోని అనేక సమస్యలను పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణ రెడ్డి హామీతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో నాయకులు నందిగామ కృష్ణ, ఆంటోని, నాగరాజు, సాయి, సుజాత, చంద్రకళ, లక్ష్మీ, శకుంతల, మంగమ్మ, ముత్తమ్మ, నాగమణి, బిందు, రవి, రాంబాబు పాల్గొన్నారు.