Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-గాంధీచౌక్
రాబోయే కాలంలో ప్రజా ఉద్య మాలకు అనుకూలంగా ఉండబో తుందని మిలిటెంట్ పోరాటాల ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
స్థానిక మంచికంటి భవన్లో ఆదివారం ఏలూరి రఘు నగర్లో జరిగిన సిపిఎం ఖమ్మం టూ టౌన్ మహాసభకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నున్నా మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలని నిలువు దోపిడీ చేస్తున్నాయని, దీనిపై ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న కాలంలో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మించి టూ టౌన్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభ లో సిపిఎం ఖమ్మం టూ టౌన్ నూతన కార్యదర్శిగా బోడపట్ల సుదర్శన్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరావు, జిల్లా నాయకులు ఎంఏ.జబ్బార్, విష్ణు, నాగరాజు, యర్రా శ్రీనివాసురావు, బి.గంగాధర్, కొల్లి అనుదిప్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.