Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వచ్చే ఎన్నికల్లో ఆపార్టీలకు గుణపాఠం
తప్పదు
అ పాలేరు నియోజకవర్గంలో ఎర్రజెండా
ఎగరడం ఖాయం
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం.
నవతెలంగాణ-కూసుమంచి
పెట్రోల, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోతూ..పన్నుల మీదు పన్నులేస్తూ ప్రజల రక్తాన్ని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు జలగల్లా తాగుతున్నాయ ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన పార్టీ మండల మహాసభకు తమ్మినేని హాజరై ప్రసంగించారు. ఈ పాలేరు నియోజకవర్గంలో దొరల ఆగడాలపై పోరాడి ప్రజల మన్ననలు పొందిన పార్టీ సీపీఐ(ఎం) అని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడం ఖాయం అన్నారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే దైర్యం లేక పిరికితనం ప్రదర్శిస్తుందన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టం తెస్తే దానిని ఒక్కరోజు మాత్రమే టీఆర్ఎస్ వ్యతిరేకించిందని, అలాగే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటించి బిజెపికి అనుకూలంగా మారిందన్నారు. ప్రస్తుతం ఈరెండు పార్టీలు రాజకీయాలను భ్రష్టుపట్టించాయన్నారు. ప్రభుత్వ సొమ్మును పార్టీ గెలవడానికి వాడుతున్నారని, దళితబంధు పథకం ఇందులో భాగమే అని తమ్మినేని అన్నారు. బీజేపీకి తొత్తుగా మారిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సభలో పార్టీ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, నాయకులు బండి రమేష్, బుగ్గవీటి సరళలు ప్రసంగించారు. ఈ సభలో నూతన మండల కార్యదర్శిగా బారి మల్సూర్ను తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి వర్గసభ్యులుగా యడవల్లి రమణారెడ్డి, శీలం గురుమూర్తి, తోటకూరి రాజు, మల్లెల సన్మతరావులను, కార్యదర్శి వర్గసభ్యులుగా ఎన్నికైనారు.గోపె వెంకన్న, బిక్కసాని గంగాధర్, హళావత్ బాసునాయక్, తాళూరి వెంకటేశ్వర్లు, ఎర్రబోయిన భారతి, జవ్వాజి శ్రీను, వెళ్ళంపల్లి అశోక్, సోమనబోయిన క్రిష్ణయ్య, శీలం జానయ్య, గోపె వినరు కుమార్, మూడు గన్యానాయక్, నిరుడు సంఘయ్య, ఉల్లోజు కర్ణబాబు, రెడ్డిమళ్ళ వెంకటయ్య, చీర్ల రాదాక్రిష్ణ, పందిరి వీరారెడ్డి, తాళూరి అనిత తదితరులను మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.