Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భవిష్యత్ కమ్యూనిస్టులదే
అ సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ-చింతకాని
అఖిల భారత స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆ పార్టీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని సీపీఐ(ఎం) మండల 8వ మహాసభ చింతకానిలోని గడ్డం ఆదినారాయణ నగర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడతూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు పరుస్తున్న బీజేపీతో పెనుప్రమాదం పొంచి ఉందన్నారు. దేశంలో సాగుతున్న మతోన్మాద రాజకీయాలు చేస్తూ మత సామరస్యానికి తీవ్ర ఆటంకం కలుగిస్తుందన్నారు. స్వాతంత్రోద్యమ పోరాటాన్ని, సాయుధ తెలంగాణ పోరాటాలను బీజేపీ వక్రీకరిస్తుందన్నారు. వివిధ మతాలు, కులాలు, భాషలతో కూడిన విభిన్న సంస్కృతి గల దేశం భారతదేశమన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేయబోతున్నామన్నారు. భవిష్యత్ ఉద్యమాలలో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని అన్నారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి గా మడిపల్లి గోపాల్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మాదినేని రమేష్, సామినేని రామారావు, చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, మండల కమిటీ సభ్యులు వత్సవాయి జానకిరాములు పాల్గొన్నారు..