Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణుగూరు: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని పినపాక నియోజకవర్గ కోకన్వీనర్ గురిజాల గోపి అన్నారు. సోమవారం ప్రభుత్వ హాస్పటల్ నందు వచ్చిన ఫిర్యాదుల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షులు భద్రాచలం శాసనసభ్యులు పోదెం.వీరయ్య ఆదేశాల మేరకు గురిజాల.గోపి అకస్మాత్తుగా హాస్పిటల్ కు వెళ్లి హాస్పిటల్ నందు వారికి కల్పించే వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాత్రివేళ వచ్చే పేషెంట్స్ కి సరైన వైద్యం అందక ల్యాబ్ సిబ్బంది లేక ఇబ్బంది పడటం జరుగుతుందన్నారు. పేషెంట్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను తెలుసుకున్న వెంటనే వైద్యాన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. మరల ఎటువంటి ఫిర్యాదులు తమ దృష్టికి రాకుండా పేషెంట్స్ కి వసతులు కల్పించాలని వైద్యాధికారులను హెచ్చరించారు.
వ్యవసాయ మార్కెట్ కు వరుసగా సెలవులు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు దసరా పండుగ సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నెల 14 నుండి 17 వరకు సెలవులు కావడంతో రైతు సోదరులు తమ సరుకులను మార్కెట్కు తీసుకొని రావద్దని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైతు సోదరులను కోరారు. సోమవారం తిరిగి మార్కెట్ యార్డులు యధాతధంగా పని చేస్తుందనితెలిపారు.