Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలి
అ సాగు దారులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది
అ జిఓ-76లో జరిగిన అక్రమాలపై తనకు ఎలాంటి సంబంధంలేదు
అ విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం పోడు సాగుదారులకు న్యాయం చేసేందుకు యోచిస్తుందని, త్వరలో కొత్తగూడెం నియోజక వర్గంలో అర్హులైన పోడు సాగుదారుల అక్టోబర్ చివరి వారం నుండి దరఖాస్తులు తీసుకుంటామని, అప్పటి వరకు ఫారెస్టు అధికారులు పోడు సాగుదారుల పట్ల సమన్యయం పాటించాలని, పోడు భూముల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని, పోడు సమస్య పరిష్కరించే వరకు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం చెప్పేది వినాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పోడు సాగుదారులకు న్యాయం చేసేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నారని, పోడు సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలో అఖిల పక్షం సమావేశం నిర్వహించారని తెలిపారు. నియోజక వర్గంలో ఉన్న పోడు సాగుదారుల నుండి అక్టోబర్ చివరి వారం నుండి క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. త్వరలో పోడు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చి, రైతు బంధు వర్తింప చేసే విధంగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు.
కన్నవారి సాక్షిగా ఒక్కపైసా తెలియదు...?
కొత్తగూడెం పట్టణంలో ఇండ్ల స్థలాల క్రమ బద్దీకరణ జిఓ-76 ద్వారా జరుగుతున్న ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణలో రూ.కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని, ప్రభుత్వ భూములు పట్టాలు చేస్తున్నారని, రూ.కోట్లు చేతులు మారుతున్నాయని వస్తున్న ఆరోపనలను ఎమ్మెల్యే కొట్టిపారేశారు. తమకు క్రమ బద్దీకరణ విషయంలో ఒక్క పైసా అక్రమానికి పాల్పడలేదని తెలిపారు. తన కన్నవారి సాక్షిగా ఎలాంటి అక్రమాలు తమకు తెలియదని వాపోయారు. ఎవరైన అక్రమాలకు పాల్పడిన ఆధారాలు ఉంటే తనకు నేరుగా కలిసి సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ యంత్రాంగం క్రమబద్దీకరణ పట్టాల విషయంలో జరిగిన అక్రమాలపై కూపిలాగుతున్నారని తెలిపారు. ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్నారు. దీపావళి నాటికి పెండింగ్లో ఉన్న క్రమబద్దీకరణ పట్టాలు అందజేస్తామని తెలిపారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి 2014 తరువాత నుండి కొత్తగా ఇండ్లు కట్టుకున్న వారికిసైతం న్యాయం జరిగేల క్రమ బద్దీకరణకు మరో జిఓను తీసుకు వచ్చే విధంగా కృషిచేసి వేలాది మందికి అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు.
ముద్రగడని పరామర్శించిన సున్నం నాగమణి
అన్నపురెడ్డిపల్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముద్రగడ వెంకటేశ్వరరావు గత కొన్ని రోజులు క్రితం నారోగ్యానికి పాల్పడి హాస్పటల్లో చికిత్స పొంది గత రెండు రోజులు క్రితం స్వగ్రామం రాజపురం రావడంతో రాష్ట్ర పీసీసీ కాంగ్రెస్ మహిళ కమిటీ సభ్యురాలు సున్నం నాగమణి ఆయన్ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన మీ కుటుంబానికి అందుబాటులో ఉంటానని వారి కుటుంభానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జమలయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు.