Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాన్వారు దాడికి కారకుడైన కేంద్ర మంత్రిని
మంత్రి మండలి నుంచి తొలగించాలి
అ మంత్రి కుమారుడిపై హత్య కేసు
నమోదు చేయాలి
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
అ యూపీ ఘటనను నిరసిస్తూ
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతులను దివాలా తీయించే నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది కాలంగా కొనసాగుతున్న ఉద్యమాలను తట్టుకోలేకే కేంద్ర ప్రభుత్వం మారణహౌమానికి తెగబడుతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి అజరు మిశ్రా కాన్వారు రైతులపై జరిపిన దాడిని నిరసిస్తూ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు ఆందోళనాకారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంద న్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను అనిసివేసే కుట్రలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే లంఖింపూర్ ఖేరీ జాతీయ రహదారిపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కాన్వారుతో దాడి జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్నారని మండి పడ్డారు. హత్యా రాజకీయాలతో ఉద్యమాలను అణిచివేయాలని ప్రయత్నంచడం సిగ్గుచేటన్నారు. దాడికి కారకుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించాలని, ప్రత్యక్ష కారకుడైన మంత్రి కుమారుడు అశీష్ మిశ్రా, అతని అనుచరులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు కందుల భాస్కర్, వి.పూర్ణచందర్రావు, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు కె.రత్నకుమారి, ధీటి లక్ష్మి పతి, జలీల్ పాషా, లింగయ్య, పారుపర్తి రాజు, కుంజ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
చర్ల : రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చిన నల్ల చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేఖించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ అన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి లఖింపూర్‌లో మరణించిన రైతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాల్లో కారం నరేష్, మచ్చా రామారావు, శ్యామల వెంకట్, భోళ్ళ వినోద్, చంటి, రైతులు నాయకులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : హత్యలతో రైతులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరని సీఐటీయూ అనుబంద తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్సన్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి గురవయ్య అన్నారు. సోమవారం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చిన్నబండిరేవు గ్రామంలో ప్రదాన రహదారిపై లఖింపూర్‌లో మృతి చెందిన రైతులకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. ఈ ర్యాలీలో బూస రమేష్, ఉప్పు సాయిబాబు, బాలక్రిష్ణ, జంపయ్య, మేలక మోహన్‌రావు, వెంకటేష్, శైలజ, సత్యవతి, సుజాత, లకీë, నాగమని, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం దుర్మార్గ వైఖరి అవలంభిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ పట్టణ మండల కన్వీనర్ గూడెపురి రాజు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్ర మంత్రి కుమారుడు తన కార్ల కాన్వారుతో తొక్కించి తొమ్మిది మంది రైతుల మృతికి కారణమైన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఈ ప్రమాదంలో గాయపడిన రైతులకు రూ.50 లక్షలు ఇవ్వాలని బస్ స్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొట్టే నవీన్, బీసీఎన్ రోడ్ హమాలి వర్కర్స్ యూనియన్ ముఠామేస్త్రి గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.