Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోటరీ ఆధ్వర్యంలో 2025 నాటికి
90 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం
అ 'నేషన్ బిల్డర్ అవార్డ్'తో
ఉపాధ్యాయులకు సత్కారం
అ రోటరీ 3150 జిల్లా గవర్నర్ కె. ప్రభాకర్
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజంలో గురువుల పాత్ర ఎంతో ప్రముఖమైనదని, రోటరీ క్లబ్ ఆధ్వ్యంలో 2025 నాటికి దేశంలో 90 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ పనిచేస్తుందని రోటరీ 3150 జిల్లా గవర్నర్ కె.ప్రభాకర్ తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి ''నేషన్ బిల్డర్ అవార్డ్'' ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లా డుతూ ప్రపంచంలో పోలియో మహమ్మారిని తరిమి కొట్టడం లో రోటరీ క్లబ్ ప్రముఖ పాత్ర వహించిందని గుర్తుచేశారు. అదేవిధంగా కోవిడ్ పరిస్థితులలో కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రులకు కోవిడ్ ఐసోలేషన్ పడకలు అందించడం, ఆక్సి జన్ కాన్సంట్రేటర్లు అందించడం, పేదలకు మాస్క్లు, శానిటై జర్లు అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో గురువుల పాత్ర ఎంతో ప్రముఖమై నదని, వారిని గౌరవించుకోవడమంటే విద్యను గౌరవించడమే నని, అందుకే రోటరీ క్లబ్ ప్రతిసంవత్సరం గురువులను 'నేషన్ బిల్డర్ అవార్డ్'' తో సత్కరిస్తుందని తెలిపారు. 15 మంది లెక్చ రర్లు, ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఈ అవార్డ్ అంద జేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ మాట్లాడు తూ విద్యా వ్యవస్థలో సమాజం పాత్ర ఎంతో ఉంటుందని, రోటరీ వంటి స్వచ్చంద సంస్థలు విద్యావ్యవస్థతో కలిసి పనిచేయడం ఆనందదాయకమని అన్నారు. ఈ సందర్భంగా 100 మంది పిల్లలకు సోలార్ స్టడీ ల్యాంపులను రోటరీ గవర్నర్ అందజేశారు. అనంతరం ఎంపిక చేయబడిన 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ఆఫ్ కొత్తగూడెం అద్యక్షులు ఎ.నాగరాజ శేఖర్, డాక్టర్ టి. విజేంద్రరావు, జె. అబ్రహం, ఎ.పాపయ్య, ఉండేటి ఆనందకుమార్, ఎకెవి. చలం, సురేష్, చలపతిరావు, రోటరీ క్లబ్ ఆఫ్ సభ్యులు పాల్గొన్నారు.
భద్రాచలం : మహిళా సాధికారిత విద్యాభివృద్ధి, వైద్యం రోటరీ ధ్యేయమని రాష్ట్ర గుంటూరు, ప్రకాశం జిల్లాల రోటరీ ఇంటర్నేషనల్ (3150) జిల్లా గవర్నర్ కొంపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం రివర్సైడ్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి త్వరలో అన్ని వసతులతో కూడిన వాహనాన్ని క్యాన్సర్ నిర్మూలన కోసం అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. రోటరీ జిల్లా 3150 పరిధిలోని విద్యార్థినీ, విద్యార్థుల చదువుల కోసం అక్షరాస్యతను పెంపొందించడం కోసం హ్యాపీ స్కూల్స్ పేరుతో ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. అలాగే మహిళా విద్యార్ధినీలకు, విద్యార్థులకు సపరేట్ టాయిలెట్ నిర్మాణం స్వచ్ఛ మంచినీటి సరఫరా స్కూల్ డెస్కులు లైబ్రరీ కంప్యూటర్ తదితర అన్ని వసతులతో తెలంగాణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో అనేక స్కూళ్లలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని నిరు పద కిడ్నీ బాధితులు హైదారాబాద్లో నెలకొల్పిన డయాలసిస్ సెంటర్ని ఉపయోగించుకొనవల్సిందన్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర, గుంటూరు, ప్రకాశం, జిల్లాల రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నరు నామిని డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డితో పాటుగా రోటరీ క్లబ్ రివర్సైడ్ భద్రాచలం కార్యదర్శి సంపత్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ శర్మ, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమేష్ బాబు, రోటరీ కొత్తగూడెం క్లబ్ నాయకులు ఆనంద్ కుమార్, రోటరీ క్లబ్ భద్రాచలం పూర్వాధ్యక్షులు వీర య్య, జకరయ్య, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.