Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 మందిని కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
నవతెలంగాణ-భద్రాచలం
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీపతి తిరుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ నందు మద్యం తాగి పట్టుబడ్డ వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 45 మందిని భద్రాచలం ఫస్టు క్లాస్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సురేష్ కుమార్ ముందు హాజరు పర్చారు. 22 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా, ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.2,30000 జరిమానా విధించారు. 18 మందికి ఒక్కరికీ 3 రోజుల చొప్పున న్యాయమూర్తి జైలు శిక్షవిధించారు.