Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జేసీ, ఎమ్మెల్యేకు వినతి పత్రం
నవతెలంగాణ-సుజాతనగర్
సుజాతనగర్ గ్రామ పంచాయతీలో ఉన్న వేపల గడ్డ గ్రామమును ప్రత్యేక పంచాయతీగా మార్చాలని గ్రీవెన్స్‌లో భాగంగా జేసీ, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సోమవారం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో 1050 మంది జనాభాలో 750 మంది ఓటర్లు ఉన్నారని, గతంలో 500 ఓటర్లు ఉంటే నూతన పంచాయతీల ఏర్పాటు చేశారని, దీనికి అనుగుణంగా తమ గ్రామాన్ని గ్రామపంచాయతీ మార్చాలని అన్నారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా వేపల గడ్డ గ్రామాన్ని పంచాయతీగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రేడ్డం తులసి రెడ్డి, జయరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీను, గంగయ్య, చిలక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వికలాంగుడు మృతి
నవతెలంగాణ-ఇల్లందు
కొత్తగూడెం రోడ్డు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద రెండు బైకులు ఢ కొన్న ఘటనలో ఓ వికలాంగుడు (60) మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలు కావడంతో ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని జగదాంబ సెంటర్‌కు చెందిన వికలాంగుడు శంకర్ సాహు (60) అతని కుమారుడు గణేష్ టేకులపల్లి నుండి ఇల్లందుకు కలిసి వస్తున్న బైక్‌ను కారేపల్లి నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న మరో యువకుడి బైక్ ఢకొీనడంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గంమధ్యలో శంకర్ సాహు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.