Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
యాసా కొండల్ రావు మృతి, పార్టీకి, ప్రజానికానికి తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం జూలూరుపాడులో పార్టీ సీనియర్ నాయకులు యాసా కొండల్ రావు స్మారక స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. పార్టీ జెండాను రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ఎగురవేశారు. అనంతరం స్థానిక యెల్లంకి గార్డెన్లో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చిమలపాటి బిక్షం అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కొందల్రావు ప్రజాఉద్యమలు నిర్మించేదాంట్లో, ఈ ప్రాంత రైతాంగ కార్మిక, పోరాటాలు పెద్దఎత్తున నిర్మించారని, పోడుభూముల ఉద్యమం, కూలిరేట్ల పెంపు పోరాటాలకు నాయకత్వం వహించారని, ఆయన పార్టీకి చేసిన చేసిన సేవలను కొనియాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటినుంది ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందని వాటిలో రైల్వేస్టేషన్, బ్యాంక్, విమాన, పరిశ్రమలు, రైళ్లు, బొగ్గు, విద్యుత్, వైజాగ్ స్టీల్ ప్లాంట్లను వ్యవసాయ రంగాలను పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చూస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పుటికప్పుడు వ్యతిరేకించాలని జరిగే ఉద్యమంలో పాల్గొనటమే కొండలరావుకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అదేవిధంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... కొండల రావు మృతి బాధాకరమన్నారు.
చిన్న వయస్సు నుంచి పని చేసి అనేక ఉద్యమాలలో చాలా చురుగ్గా పాల్గొనేవాడన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్రా కార్యదర్శి ఎం.సాయిబాబు, పోతినేని సుదర్శన్ రావు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, నున్న నాగేశ్వరరావు, ఏజే.రమేష్, భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, అన్నవరపు, సత్యనారాయణ, గుగులోత్ ధర్మ, యలమంచిలి రవికుమార్, కె.ధర్మ, జాటోత్ కృష్ణ, కె.నాగేశ్వరరావు, కృష్ణ, భానోత్ ధర్మ, వెంకటేశ్వర్లు, వెంకటి, మధు, కనకరత్నం, ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంపీపీ సోనీ, వెంకట రెడ్డి, జడ్పీటీసీ కళావతి, టీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి, షబీర్ పాషా, విజయభారు, నరేంద్ర, నగులమీరా, చంద్ పాషా, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, ప్రజాప్రతినిధులు బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.