Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి సహకారంతో అధునాతన
హంగులతో రామాలయ నిర్మాణం : కమిటీ సభ్యులు
నవతెలంగాణ-కల్లూరు
మండలం పరిధిలోని, చెన్నూరు గ్రామంలో నిర్మించతలపెట్టిన శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి పలు విధాలుగా విరాళం అందించిన దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ముందుగా ఆలయ నిర్మాణానికి 4 కుంటలు స్థలం దానం చేసిన కందిబండ లక్ష్మీ నరసింహారావు కుటుంబ సభ్యులను, ఆలయ ధర్వాజాలు, తలుపులు అందించిన కందిబండ రాజారావు, ధ్వజ స్తంభం అందించిన కందిబండ జగన్నాథరావు, ఆలయ నిర్మాణానికి సిమెంట్ లోడు రూ.1.60 లక్షల విరాళం అందించిన గింజుపల్లి అర్జున్ రావు, ఏలూరి వెంకటేశ్వరరావు రూ 1.19 లక్షలు, కొడిశాన చిన్న సర్వేశ్వరరావు రూ.లక్ష, కొడిశాన పెద్ద సర్వేశ్వరరావు రూ. 1.10 లక్షలు, లెక్కల బసవయ్య రూ.2.50 లక్షలు అందించినందుకు ఆలయ నిర్మాణానికి భక్తితో విరాళం అందించిన వారందరకూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సొసైటీ చైర్మన్ పాలెపు రామారావు మాట్లాడుతూ... రామాలయ నిర్మాణం అత్యధిక వ్యయంతో కూడుకున్న పని అని, పరిసర గ్రామాలకు తలమానికంగా ఉండేవిధంగా, మన గ్రామ ప్రజల ప్రతిష్ట పెంచే విధంగా నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. అలాగే రాబోవు రోజుల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సహకారంతో చెన్నూరు గ్రామాన్ని మరో మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి చేసుకోవాల్సిన ఆవశ్యకత మనపై ఉందని అన్నారు.
అలాగే ఇప్పటికే సొసైటీ భవనాన్ని, సొసైటీ బ్యాంక్‌ను ఆధునాతన అంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్నామని, అధునాతన పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి కార్యాచరణ పూర్తి అయిందని, ఈ విధంగా చెన్నూరు గ్రామ రూపు రేఖలు అందరూ గర్వ పడేలా మార్పు చేయడం జరుగుతుందని అన్నారు.