Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
దసరా సందర్బంగా నిర్వహించే శ్రీకోటమైసమ్మ తల్లి జాతరను అన్ని శాఖల అధికారులు సమిష్టిగా సమన్వయంతో విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీకోటమైసమ్మ ఆలయం ప్రాంగణంలో జాతర ఉత్సవాలపై సన్నహక సమావేశంను ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వ తేది నుండి 19 వరకు జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు రానున్న తరణంలో దానికి అనుగుణంగా ఏర్పాట్లను ప్రతి శాఖ దాని పరిధిలో చూడాలన్నారు. జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించనుందన్నారు. ఈకార్యక్రమంలో వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ బానోత్ బన్సీలాల్, ఎంపీటీసీ మూడు జ్యోతిమోహన్, పెద్దబోయిన ఉమాశంకర్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ కమిటీ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, ఈవో అద్దంకి నాగేశ్వరరావు, తహసీల్ధార్ కోట రవికుమార్, ఎంపీడీవో మాచర్ల రమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధానకార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.