Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మారుమూల గిరిజన గ్రామాల ప్రజల పక్షాన ముందు ఉండి పోరాటాలు నిర్వహించిన సరియం సన్యాసి ఉద్యమ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. బుధవారం అమరజీవి కామ్రేడ్ సరియం సన్యాసి 14 వ వర్దంతి సభ ఉబ్బా భద్రయ్య అధ్యక్షతన జరిగింది. పౌల్లూరి పేట గ్రామంలో ఆయన స్థూపం వద్ద జరిగిన వర్ధంతి వేడుకల్లో పార్టీ జెండాను ఎగురు వేశారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పెద్ద కుమారుడు సరియం వెంకటేశ్వర్లుతో పాటు పలువురు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పుల్లయ్య, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సరియం కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి సరియం సన్యాసి మారాయిగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలను ఆయన నాయకత్వంలో నిర్వహించారని వారు అన్నారు. నేటి గిరిజన యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలన్నారు. మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేసి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యురాలు లకీëనగరం సర్పంచ్ సరియం రాజమ్మ, ప్రసాద్, కొమరం వీర్రాజు, ఉబ్బా వెంకటేష్, ఉబ్బా వీరభద్రం, సరియం కన్నమ్మ, రాజులు, వీరయ్య, రామయ్య, రాజేష్, చంటి, సీతమ్మ, కమల, బుల్లెమ్మ, చిన్నక్క పాల్గొన్నారు.