Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జేడీ ఫౌండేషన్- భద్రాచలం కి డా.అబ్దుల్ కలాం జాతీయ సేవా పురస్కారం
అ ఇటీవల అమరులైన జవాన్లకు అంకితం
నవతెలంగాణ-భద్రాచలం
మూడు సంవత్సరాల క్రితం భద్రాచలం పట్టణ కేంద్రంగా ప్లాస్టిక్ నిషేధంతో మొదలై అనతికాలంలోనే అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉపాధి భరోసా పేరుతో నిరుపేద మహిళకి జీవనోపాధికి పెద్దపీట వేసి, సామాజిక సేవే మార్గంగా ముందుకు నడుస్తున్న జేడీ ఫౌండేషన్‌ని 2021 సంవత్సరానికి గాను అబ్దుల్ కలాం జాతీయ సేవా పురస్కారం వరించింది. ఈ మేరకు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రపంచ రికార్డు సాధించిన త్యాగ రాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుండి పురస్కారం లభించిన ఏకైక సంస్థ జేడీ పౌండేషన్ కావడం విశేషం. కరోనా నేపద్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి యాచకులకు, వలస కూలీలకు అన్నదానము ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లు మారుమూల గ్రామాల్లో సైతం అందించడం తదితర సేవకులకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ నందు అతిరథ మహారథుల సమక్షంలో ఈ పురస్కారాన్ని హైదరాబాద్ ప్రాంతంలోని జెడి ఫౌండేషన్ సభ్యులు విశాల్, అతని మిత్రబృందం భద్రాచలం జేడీ ఫౌండేషన్ బాధ్యుడు మురళి మోహన్ కుమార్ తరుపున స్వీకరించారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ప్రారంభమైన జేడీ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని నిర్వాహకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తమ బాధ్యత మరింతగా పెంచిందని, ఈ అవార్డును రెండు రోజుల క్రితం దేశ భద్రత కోసం అమరులైన ఐదుగురు జవాన్లకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ పురస్కారం లభించడం కి తనతోపాటు సహకిరించిన, మిత్రులకు,జేడీ ఫౌండేషన్ సభ్యులకు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఖంభంపాటి సురేష్ సహకారం, జేడీ ఫౌండేషన్ చైర్మన్ జేడీ లక్ష్మీనారాయణ మార్గనిర్దేశం ఎల్లప్పుడూ మరువలేనిదని ఈ సందర్భంగా అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ఆయన తెలిపారు.