Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాల్గొన్న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల కార్యక్రమాల్లో కొత్తగూడెంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లు పాల్గొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలులో డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో చైర్మెన్ కోరం కనకయ్య పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆట.. పాటలతో కోలాటం ఆడి ఉత్సాహం నింపారు. గౌరమ్మ ఉయ్యాల.... బంగారు ఉయ్యాల అంటూ నృత్యం చేస్తూ మహిళతో ఆడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆట పాటలతో 9 రోజుల పాటు పండుగని చేసుకుంటున్నామని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన అరుదైన సాంప్రదాయ సంపద బతుకమ్మని కొనియాడారు. అద్భుతమైన ఈ పూల పండుగను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళా ఉద్యోగులకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జెవిఎల్ శిరీష, టిజిఓ అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య, పీఆర్ ఈఈ సుధాకర్, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఆర్ఐఓ సులోచన, పాల్వంచ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.