Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మహమ్మారి ఇంకా పొంచి ఉంది
అ నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
అ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ వైరస్ మహమ్మారి ఇంకా మనల్ని విడిచి పెట్టి పోలేదని, కోవిడ్ నియంత్రణ చర్యలు పాటించాలని, స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించడం కోసం ప్రయత్నాలు చేయవద్దని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూరు శాతం వాక్సినేషన్ పూర్తి చేసి ఇతర జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని ముందు బాగాన నిలవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు కోరారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో ప్రజా ప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ నియంత్రణ, వాక్సినేషన్ గురించి ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్-19 కరోనా వైరస్ కేసులు ఇతర రాష్ట్రాల కంటే తక్కువ నమోదు అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది చేసిన కృషి అమోఘం అన్నారు. జిల్లాలో. ఇంకా మహామారి పొంచివుందని, ప్రజలు కోవిడ్ నియంత్రణకు చర్యలు పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకి కోలుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డ విషయాన్ని తెలిపారు. కోవిడ్ నియంత్రణతోనే మనం స్వేచ్చా జీవితాన్ని సాధించగలమని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలలు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ పూర్తిచేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని కోరారు. దానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కావడం విచారకరమన్నారు. అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ది పథంలో తీసుకు వెలుతున్న కలెక్టర్ అనుదీప్‌ను అభినందించారు.
కోవిడ్ నియంత్రణలో కృషి....జిల్లా లెక్టర్ అనుదీప్
జిల్లాలో కోవిడ్ నియంత్రణలో ఆరోగ్య, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖలు సమన్వయ కృషితో కోవిడ్ నియంత్రణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, డిఎం అ ండ్ హెచ్ఓ డాక్లర్ జెవిఎల్.శిరీష, వైద్యసిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.