Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలో ఎస్బీఐటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థిని ''మాటేటి స్వప్న'' కు 2020-21 ఫైనాన్స్ విభాగంలో జేఎన్టీయూ స్థాయిలో బంగారు పతకం సాధించిందని కళాశాల చైర్మన్ జి.కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ విద్యార్ధినికి గోల్డ్ మెడల్ రావడం చాలా సంతోషమని, దీనికి కారణమైన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. స్వప్నకు జేఎన్టీయూ స్థాయిలో 8.4 సిజీపీఏ గ్రేడ్ సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్‌కుమార్, కళాశాల సెక్రటరి అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి. ధాత్రి, వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాసరావు, ఎకడమిక్ డైరెక్టర్స్ డాక్టర్ సి. సత్యనారాయణ, డాక్టర్ సి.కృష్ణకాంత్, డాక్టర్ ఎ.వి.వి. శివ ప్రసాద్, డాక్టర్ సి. శ్రీనివాసశర్మ, జి. ప్రవీణ్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ఇన్ చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి. రవి, వివిధ విభాగాల హెచ్ వోడిలు అభినందించారు.