Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-భద్రాచలం
కాన్పు కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళితే.. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వైద్య సేవలు అందించడంతో తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని, జరిగిన సంఘటన పై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని భద్రాచలం పోలీస్ స్టేషన్లో బాధితులు బుధవారం ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నిర్లక్ష్య వైద్యం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం. రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాధితురాలి తల్లిమడి నాగలక్ష్మి పేర్కొన్నారు. మణుగూరు మండలం దమ్మక్క పేట గ్రామానికి చెందిన తన కుమార్తె జలుమూరి మధులత రెండో కాన్పు నిమిత్తం భర్త సంతోష్ మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లారని ఆమె పేర్కొన్నారు. అయితే అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కాన్పు నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఈనెల 5న తరలించినట్లు ఆమె తెలిపింది. అదేరోజు తన కుమార్తె మధులత చిన్న ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారని ఆమె పేర్కొంది. ఆ సమయంలో మల, మూత్రములకు సంబంధించిన పేగును కట్ చేయడంతో మూత్రం ద్వారా మల ప్రవేశం జరిగిందని తెలిపింది. ఈ నెల 6న డిశ్చార్జ్ చేసినారని, ఇంటికి వెళ్లిన తరువాయి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన వైద్యం వికటించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం. రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దిశ ఆశ్వాపురం మండల అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ, పూజారి జ్యోతి, మల్లు స్వరూప,తదితరులు పాల్గొన్నారు.
పసిపాపతో అసభ్యకరంగా ప్రవర్తించిన