Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
జిల్లా అభివృద్ధే తన లక్ష్యమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని తనికెళ్ళ నుంచి రఘునాథపాలెం మండలం గణేశ్వరం వెళ్లే రహదారికి 3 కోట్ల 33 లక్షల రూపాయలతో నిర్మించే బిటి రోడ్డుకు బుధవారం ఎంపీ నామా నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు తీతంగా జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడం కోసం జిల్లాలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టానన్నారు. ప్రతి గ్రామాన్ని మండల, జిల్లా రోడ్లకు అనుసంధానం చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తాను మొదటి సారి ఎంపీగా గెలిచిన సమయంలో 2009-14 మధ్య కాలంలో రూ.174 కోట్ల నిధులతో 312 గ్రామాల్లో 962 కి.మీ రోడ్లకు మంజూరి ఇప్పించానన్నారు. జిల్లాలోని పాలేరు నుంచి కొత్తగూడెం వరకు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే రాములు నాయక్, ఎంఎల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్‌లు ఉన్నారు. మందుగా నామాకు టీఆరెస్ మండల పార్టీ ఆద్వర్యంలో పూలతో ఘన స్వాగతం పలికారు. తనికెళ్ళలో మహిళలు ఏర్పాటు చేసిన బతుకమ్మను ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చల్లా మోహన్‌రావు, ఎంపిపి గోసు మధు, జడ్పీటీసీ పోట్ల కవిత, పీఆర్ ఈఈ చంద్రమౌళి, టీఆరెస్ మండాలద్యక్షుడు వై చిరంజీవి, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ కీలారు మాధవరావు, పిఎసిఎస్ చైర్మన్ చెరుకుమల్లి రవి, దోడ్డపనేని రామారావు, రాయల పుల్లయ్య, పాసంగులపాటి శ్రీను, పోగుల శ్రీను, పోట్లపల్లి శేషగిరి, ఏఈ రమేష్, ఎంపిడివో ఆర్ రమాదేవి, సుడా డైరెక్టర్ బండారు క్రిష్ణ, చిలూకూరి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) వినతి
ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంఎల్ఏ లావుడ్యా రాములు నాయక్‌లకు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేతో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, సిపిఎం మండల కార్యదర్శి దొంత బోయిన నాగేశ్వరరావులు మాట్లాడుతూ గిరిజన మండల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తోందని, కనీసం డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేకపోయారని వాపోయారు. పోడు రైతుల అందరికీ హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టం ద్వారా గ్రామస్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన, బందులాంటి పథకాలను మండలంలో ప్రారంభించాలని కోరారు. గిరిజన తండాలు కూడా అంతర్గత రోడ్లు నిధులు కేటాయించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సిపిఎం నాయకులు, రేపల్లెవాడ ఎంపిటిసి సభ్యులు భూక్యా లచ్చు నాయక్, ఏర్పుల రాములు, ఇటికల లెనిన్, బండ్ల చిన్న జోగయ్య పునెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.