Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొవ్వొత్తులతో ర్యాలీ
నవతెలంగాణ - వైరాటౌన్
లంఖిపూర్లో శాంతియుతంగా ఆందో ళన చేస్తున్న రైతులపై నుంచి కారు నడిపి నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాపై చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో లాలాపురం గ్రామంలో లఖీంపూర్‌లో మరణించిన రైతులు, జర్నలిస్టుకు శ్రద్ధాంజలి, నివాళులు అర్పిస్తూ మహిళా రైతులు కాండిల్ లైట్ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, గోపవరం సోసైటి డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, రైతు సంఘం లాలాపురం గ్రామ కార్యదర్శి సంక్రాంతి పురుషోత్తం, మాజీ సర్పంచ్ సంక్రాంతి చంద్రశేఖర్, మోదుగు వెంకట్, నామా శ్రీనివాసరావు, నామా విజయ, జక్కంపూడి సరోజిని, సంక్రాంతి సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
వైరా మండల కమిటీ ఆధ్వర్యంలో...
లఖింపూర్ రైతు అమరవీరులకు వైరా మండలం గన్నవరం గ్రామంలో రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ తోట నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు శీలం వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారుమంచి మల్లయ్య, ఉప సర్పంచ్ కారుమంచి సుధాకర్, కారుమంచి జైయరావు, సిఐటియు నాయకులు కారుమంచి పౌలు, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు
ఖమ్మంరూరల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మండలంలోని తెల్దారుపల్లి, కాచిరాజుగూడెం, పల్లెగూడెం, బారుగూడెం గ్రామాల్లో బుధవారం కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహిం చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బందెల వెంకయ్య, పి.మోహన్ రావు, పొన్నం వెంకటరమణ, గజ్జి పట్టాభి, బోడపట్ల శ్రీను, సిరికొండ నగేష్, అద్దంకి తిరుమలయ్య, కారుమంచి గురవయ్య, పొన్నం మురళి, దనియకుల రామయ్య, జి.నాగయ్య, మేకపోతుల వీరయ్య, నర్రా రామయ్య, గంగుల గోపి, పేరం కోటయ్య, పోతురాజు సావిత్రి,పెండ్యాల సుమతి, బోళ్ల ఉష, నాగమణి, గుంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి : మల్లేపల్లిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్లకార్డులు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, పార్టీ మండల నాయకులు తోటకూరి రాజు, మల్లెల సన్మతరావు, బిక్కసాని గంగాధర్, చీర్ల రాదాక్రిష్ణ, తాళూరి రవి, సర్పంచ్ పొట్టపింజర నాగేశ్వరరావు, శీలం జానయ్య, మాదాల వెంకటేశ్వర్లు, ప్రతాప్, చక్రి తదితరులు పాల్గొన్నారు.