Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంబానీ, అదానీలకు మోడీ ఊడిగం
అ జనం అన్నీ గమనిస్తున్నారు...
అ గుణపాఠం చెప్పడం ఖాయం
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని, జనం అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు గుణపాఠం చెప్పడం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండల కేంద్రంలో ఎడ్ల మల్సూరు ప్రాంగణంలో సిపిఎం మండల 8వ మహాసభ పార్టీ మండల కమిటీ సభ్యలు తుళ్ళూరి నాగేశ్వరరావు, పద్మనాబుల సుధాకర్, కాంపాటి శ్రీదేవిల అధ్యక్షతన జరిగింది. ఈ సభకు తమ్మినేని హాజరై ప్రసంగించారు. దేశసంపదను ప్రయివేటు శక్తులకు కట్టపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలపై రైతులను కారుతో తొక్కించిన యోగి పాలనను ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడించటం ఖాయమన్నారు. మతాన్ని ముందు పెట్టి కాలం వెల్ల బుచ్చుతున్న బీజేపీకి వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని అన్నారు. సీపీఐ(ఎం) కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రానున్న కాలంలో కమ్యూనిస్టులు దేశంలో, రాష్ట్రంలో బలపడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో సిపిఎం జెండా ఎగరటం ఖాయమని తెలిపారు. మహాసభ ప్రారంభానికి ముందుగా గజ్జల వెంకటయ్య భవనం నుండి సిపిఎం శ్రేణులు ఎర్ర జెండాలతో ప్రదర్శనగా బయలుదేరి మహాసభ ప్రాంగణం దగ్గరికి వచ్చారు. ప్రదర్శన ముందు భాగాన తమ్మినేని వీరభద్రం, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్‌లు ఉన్నారు. మహాసభ ప్రాంగణంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ జియావుద్దీన్ జెండా ఆవిష్కరణ చేశారు. సిపిఎం తిరుమలాయపాలెం గ్రామ శాఖ ఏర్పాటు చేసిన సిపిఎం నూతన దిమ్మ వద్ద తమ్మినేని వీరభద్రం జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నూతన మండల కమిటీనీ 21 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల కార్యదర్శిగా కొమ్ము శ్రీనుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ మహాసభలో పార్టీ జిల్లా నాయకులు నండ్ర ప్రసాద్, రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్ నవీన్‌రెడ్డి, కూసుమంచి మండల కార్యదర్శి బారి మల్సూరు, మరిపెడ బంగ్లా మండల కార్యదర్శి వీరన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.సంగయ్య, ఐద్వా సీనియర్ నాయకురాలు దొందేటి సుగుణమ్మ, మండల కమిటీ సభ్యులు అంగిరేకుల నర్సయ్య, కోట ఉపేందర్‌రెడ్డి, కొలి చలం స్వామి, ఇప్పల పుష్పావతి, ఎగినాటి వెంకటరావు, దాసరి మహేందర్, దోనెపల్లి వెంకన్న, దిండు మంగపతి, రవి, సైదులు, రేపాకుల వెంకన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.