Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ నిజాంపేట గ్రామంలో కొలువైయున్న కోట మైసమ్మ అమ్మవారికి నిజాంపేట, రేపల్లె వాడ, కట్టుగూడెం గ్రామానికి చెందిన మహిళలతో కలిసి ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ లు కాలినడకన వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కోలాటం ఆడి ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సువర్ణ పాక శోభన్ బాబు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి
గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దేవీ నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి కాలినడకన వచ్చి బోనం సమర్పించడం అనేది గొప్ప విషయం అన్నారు.
ఆ తర్వాత గ్రామ పెద్దలతో చర్చించి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆలయ కమిటీ వారికి తెలియజేశారు. అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా రేపల్లెవాడ గ్రామపంచాయతీతో పాటు ఇల్లందు నియోజక వర్గానికి ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆలయ కమిటీ చైర్మన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సువర్ణ పాక శోభన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, స్థానిక సర్పంచ్ ఆల్యం కౌసల్య, ఉప సర్పంచ్ పోటు రవి, ముసలయ్య, మూతి ముత్యాలు, కల్తీ స్వామి తదితరులు పాల్గొన్నారు.