Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లాడ : మహబూబాబాద్ నుండి కాకినాడకు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా తల్లాడలో సివిల్ సప్లై అధికారులు నిఘా వేసి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలోని 250 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కారేపల్లి : మాణిక్యారం, కొమ్ముగూడెం, పెద్దమడెంపల్లి, చర్లపల్లి గ్రామాల్లో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారని పక్కా సమాచారంతో సీఐ తాటిపాముల సురేష్ నేతృత్వంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ బియం నిల్వలపై టాస్క్‌పోర్స్, స్ధానిక పోలీసులు దృష్టి పెట్టి దాడులు చేస్తుండటంతో అక్రమార్కులలో గుబులు బయలు దేరింది. అక్రమ రేషన్ బియ్యంతో పాటు, నిషేధిత గుట్కాలపై దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.