Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రెండేళ్ల పదవీకాలం పూర్తి
అ మధిర గడపదాటని చైర్మన్ 'కమల్ రాజు'
అ జడ్పీ చైర్మన్గా అభివృద్ధి ఎక్కడ..?
నవతెలంగాణ - బోనకల్
జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర నియోజకవర్గానికే పరిమితం చేయడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధిర మండలం నుంచి లింగాల కమల్ రాజు జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి జిల్లా పరిషత్తు చైర్మన్గా రెండేళ్ల పదవి కాలం పూర్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మధిర నియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు 22 మండలాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన లింగాల కమల్ రాజు జిల్లాలో గల ఐదు నియోజకవర్గాల్లోనూ, 22 మండలాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికై రెండేళ్లు పూర్తయినా కమల్ రాజు మధిర గడప దాటలేదు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన ప్రారంభ సమయంలో మాత్రం వైరా మండల ప్రజా పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఒకటి రెండు కార్యక్రమాల్లో మినహా ఎక్కడ ఏ కార్యక్రమాలలోనూ జిల్లా పరిషత్ చైర్మన్గా పాల్గొన్న దాఖలాలు లేవని పలువురు అంటున్నారు. జిల్లా పరిషత్ పదవిని జిల్లాకు వినియోగించాలి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన వారు ఏ నియోజకవర్గ పరిధిలో గెలిచారో ఆ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని జిల్లాకే వినియోగించారు. కానీ కమల్ రాజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైనా ఆ పదవిని మధిర నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసి ఆ పదవి స్థాయిని తగ్గించారని విమర్శలు చక్కర్లు కొడుతున్నాయి. కమల్రాజు మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల చుట్టే చక్కర్లు కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని రాష్ట్ర సహాయ మంత్రి హౌదాకు పెంచారు. అంతటి ప్రాధాన్యత కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేవలం మధిర నియోజకవర్గానికే పరిమితం చేసి ఆ హౌదాను తగ్గించారని జిల్లా వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ తమ మండలానికి రాకపోవడంపై అసంతృప్తిని, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గల ఐదు నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మధిర నియోజకవర్గానికి మాత్రం సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా ఉన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గ ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్తు చైర్మన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదా లేక పట్టించుకోవడం లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోనే అనేక మండలాల ప్రజలు, అధికారులు చైర్మన్ ముఖం చూడలేదని దీనివలన చైర్మెన్ పదవి ప్రాధాన్యత ఎంత తగ్గిపోయిందో అర్థమవుతుందని పలువురు జిల్లా ప్రజలు అంటున్నారు. జిల్లా పదవిని జిల్లా ప్రజలందరికీ వినియోగించాలే గాని కేవలం మధిర ప్రజలకే ఆ పదవిని పరిమితం చేశారనే విమర్శలు, అసంతృప్తి వ్యక్తం అవుతుంది. జిల్లా పదవికి గౌరవాన్ని వన్నె తీసుకురావాల్సిందిగా పోయి తగ్గించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండటంతో అప్పుడప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్తో కలిసి ఖమ్మం కేంద్రంలో జరిగే కొన్ని కార్యక్రమాలలో కమల్రాజు పాల్గొంటు న్నారని పలువురు అంటున్నారు. మధిర నియోజకవర్గంలో కూడా గ్రామ పంచాయతీల నిధులతో ఏర్పాటు చేసే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీలతోనే సరిపెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా తన నిధులతో చేసిన అభివృద్ధి జాడ కూడా కనిపించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రభుత్వం నుంచి నిధులను తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో తప్పనిసరిగా ఉండాలి కాబట్టే అప్పుడప్పుడు జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అవుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కమల్రాజు కంటే ముందు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న గడుపల్లి కవిత మహిళ అయినప్పటికీ జిల్లా స్థాయిలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మహిళ జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు యువకుడుగా ఉన్న కమల్ రాజు మాత్రం మధిర నియోజకవర్గానికే పరిమితం కావడం పట్ల అనేకమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మూడేళ్ల పదవీ కాలాన్ని అయినా జిల్లాకు వినియోగిస్తారేమో వేచి చూద్దాం.