Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణ రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని సింగరేణి కాలరీస్ డైరెక్టర్స్ ఎన్.బలరాం, సత్యనారాయణ రావు అన్నారు. గురువారం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్లో హరిత హారం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలలో నిర్వహించే స్వచ్చ పక్వాడ కార్యక్రమాన్ని కార్పొరేట్ ఏరియాలో నిర్వహించినట్లు తెలిపారు. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా స్వచ్చ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు జానకిరాం, డాక్టర్ మంతా శ్రీనివాస్, రమేశ్ బాబు, రవి ప్రసాద్, వేంకటేశ్వర రావు, డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.