Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సివిల్స్‌లో ర్యాంకు సాధించిన కోటా కిరణ్ కుమార్‌ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ గురువారం తన చాంబర్ లో అభినందించారు. కిరణ్‌తో పాటు ఆయన తండ్రి కష్ణయ్యను సన్మానించారు. ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరానికి చెందిన కోటా కిరణ్ కుమార్ 652 వ ర్యాంకు సాధించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలుఅధిరోహించాలని కలెక్టర్ గౌతమ్, ర్యాంకర్ కిరణ్ కుమార్‌ను అభినందించారు.