Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
మహిళల రక్షణకు ప్రతీక బతుకమ్మ అని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళ అన్నారు. మండలంలోని జూపెడ గ్రామంలో గురువారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం ఉందని తెలిపారు. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ పూల బతుకమ్మ అని తెలిపారు. మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చైతన్యం కావాలని, మద్యం అమ్మకాలపై తిరుగుబాటు ఉద్యమం చేయాలన్నారు. మద్యం, మాదకద్రవ్యాల మత్తులో కామాంధులు చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారాలకు పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. చట్టసభలలో మహిళా ప్రాధాన్యం నామమాత్రంగా ఉండడంతో ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయని అని తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు దొండేటి సుగుణమ్మ, గ్రామ సర్పంచ్ మోహినమ్మ, ఉపసర్పంచి గంగారబోయిన శోభ, గడ్డం సునీత, ముమ్మడి అనసూర్యామ్మ, కోట చంద్రకళ, సౌడం సునీత, మండాది యశోద, బుద్ధ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.