Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పూజించి బతుకమ్మ సంబురాలను జరుపుకున్న మరుసటి రోజు దసరా పండుగ ను జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సహాలు, సంతోషంతో జరుపుకోవాలని మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆకాంక్షించారు.
ప్రజలకు దసరా శుభాకాంక్షలు: టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామ
రాష్ట్ర, జిల్లా ప్రజలకు టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ నామ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చేడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలని, అభివృద్ధి పనులు విజయవంతంగా కావాలన్నారు. పాడి పంటలు సమృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో విజయదశమి వేడుకలను జరుపుకోవాలని ఎంపీ నామ కోరారు.
ప్రజల జీవితాల్లో దసరా సంతోషాన్ని తీసుకురావాలి : మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ పండుగ అని, ప్రజల జీవితాల్లో ఈ విజయదశమి శాంతి, సౌభాగ్యం, సంతోషం తీసుకురావాలని పొంగులేటి ఆకాంక్షించారు. విజయదశమి పండుగ రోజున దుర్గామాత దీవెనలు, ఆశీస్సులందుకొని విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు మరెన్నో విజయాలు సాధించాలని, పదికాలలపాటు సుఖ, సంతోషాలతో తుల తూగాలని మాజీ ఎంపీ అభిలాషించారు.
ఆనందోత్సాహాలతో దసరా : కలెక్టర్ గౌతమ్
విజయదశమిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గత తొమ్మిది రోజులుగా మహిళలు ఎంతో ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారని, దసరా పండుగను కూడా ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో మరింత ఆనందోత్సాహాలతో సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశిస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి త్వరగా అంతమై ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.