Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ భార్య జయవాణి జ్ఞాపకర్ధం 42 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసిన
కౌన్సిలర్ జమలయ్య
అ ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజాప్రతినిధులు నిస్వార్ధంగా సేవలందించాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురవారం రామవరంలో ఎల్ఈడీ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ కంచర్ల జమలయ్య భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిందని, తన భార్య విజయ వాణి జ్ఞాపకార్థం దసర పండుగలను పురస్కరించుకొని 8వ వార్డు పంజాబ్ గడ్డలో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 42 స్తంభాలకు సుమారు రూ.32 వేల విలువ చేసే ఎల్ఈడీ లైట్లను సమకూర్చడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆయన ఉత్తమ కౌన్సిలర్‌గా ఆవార్డుకు ఎన్నికైన కంచర్ల జమలయ్య ఒక అడుగు ముందుకు వేసి 8వ వార్డులో చీకటి పారద్రోలేందుకు సొంత ఖర్చులతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడం ఇతర కౌన్సిలర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 8వార్డు అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ సీతా మహాలక్ష్మి, కమిషనర్ అరిగెల సంపత్ కుమార్, డీఈ నవీన్, టీపీవో ప్రభాకర్, ఏఈ సాహితి, రంగారావు, హరినాథ్, రామ్ చందర్, ఆర్.నాగేశ్వర రావు, మండల రాజేశ్వరరావు, రాములు, మున్సిపల్ సిబ్బంది రవి, అంగన్వాడీ టీచర్స్, వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.