Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ బొగ్గుబ్లాకులను అమ్ముతుంటే
మొద్దు నిద్ర పోతున్న కేసీఆర్
అ సింగరేణి సంస్థను దివాలా తీయిస్తున్న
టీఆర్ఎస్ సర్కార్
అ విలేకర్ల సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకాలకి పెడుతూ దేశసంపద ప్రజలకు చెందకుండా చేస్తున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌవర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. స్థానిక శేషగిరి భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. అమ్మకానికి కాదేది అనర్హం అన్నట్లుగా మోడీ ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌కు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ఒక్క ప్రభుత్వ సంస్థకూడా మిగిలే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. దేశవ్యాపితంగా 88 కొత్త బొగ్గుబ్లాకులను ఆదాని, అంబానిలాంటి కార్పొరేట్ శక్తులకు అమ్మివేసే కుట్రలకు తెరలేపారని, తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు, ఏపీలోని ఒక బొగ్గుబ్లాకు ప్రైవేటు చేతుల్లోకి వెలుతోందని, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నాడా అని...? ప్రశ్నించారు. తెలంగాణాలో సింగరేణి సంస్థకు ఉన్న లీజు రద్దు చేయకుండానే ప్రైవేటు సంస్థలకు బొగ్గుబ్లాకులు ఎలా అప్పగిస్తా రన్నారు. రాష్ట్ర అనుమతి లేకుండా బొగ్గుబ్లాకులు ప్రైవేటీకరించే హక్కు కేంద్రానికి ఎవరిచ్చారన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో డిఎంఎఫ్ రూపంలో 2,742కోట్లు, సిఎస్ఆర్ పేరుతో రూ.263కోట్లు ప్రభుత్వం దోచుకుందని, మరో రూ.40కోట్లు కరోణా సహాయం కింద సిఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సంస్థ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దోచిపెట్టారని తీవ్రంగా ద్వజమెత్తారు. సింగరేణి సంస్థను రక్షించు కునేందుకు కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, వర్కర్స్ యూనియన్ నాయకులు శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, జి.వీరస్వామి, వంగా వెంకట్, క్రిప్టోఫర్ పాల్గొన్నారు.