Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జాతీయ స్థాయిలో అండర్ ఆర్మ్ క్రికెట్
పోటీలకు ఎంపిక
అ ప్రోత్సహించేవారు ఉంటే తమ
ప్రతిభను మరింత చాటుతాం
అ నవతెలంగాణతో క్రీడా కుసుమాలు
మహేష్ కుమార్, సాయిరామ్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మన్యంలో పుట్టిన ఎంతో మంది పేద గిరిజన విద్యార్ధులు విద్యతో పాటు క్రీడల్లో తమ సత్తా చాటుతున్నారు. సరైన శిక్షణ ప్రోత్సాహం లేకపోయినప్పటికీ క్రీడల పట్ల ఉన్న మక్కువతో తమ ప్రతిభను సత్తా చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. మండలానికి చెందిన సోయం మహేష్ కుమార్, కుంజా సాయిరామ్లు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల గిరిజన విద్యార్ధుల ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారనే చెప్పవచ్చు.
మండలంలోని నడికుడి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్ధులు సోయం మహేష్ కుమార్ ఎస్ఆర్.బి.జి.ఎన.్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తుండగా, సాయిరాం టిటిడబ్ల్యు యుఆర్జెసి ఖమ్మం సింగరేణి కళాశాలలో ఐటిఐ విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా మహేష్ కుమార్, సాయిరామ్లు చదువుతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యతో పాటు వాలీబాల్, కోకో, రన్నింగ్, రబ్బీ, అండర్ వార్మ్ వంటి క్రీడల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడుతూ తమ ప్రతిభ కనబరుస్తున్నారు. క్రీడల్లో విద్యార్ధులు పలు షీల్డులు, పతకాలు, ప్రశంశా పత్రాలను సైతం అందుకున్నారు. ఆ ఇద్దరు విద్యార్ధుల కృషి పట్టుదలతోనే నేడు జాతీయ స్థాయిలో జరిగే అండర్ ఆర్మ్ క్రికెట్ క్రీడలకు ఎంపికయ్యారనే చెప్పవచ్చు.
క్రీడల్లో ప్రతిభ చాటుతున్న విద్యార్ధులు : మారుమూల ఆదివాసీ పల్లెలో పుట్టిన మహేష్ కుమార్, సాయిరామ్లు విద్యతో పాటు క్రీడల్లో తమ సత్తా చాటుతున్నారు. జిల్లా రాష్ట్ర స్థాయిలో వాలీబాల్, అండర్ ఆర్మ్, రబ్బీ, కోకో, రన్నింగ్ వంటి క్రీడల్లో పాల్గొంటూ ఛాంపియన్లుగా నిలుస్తున్నారు. సోయం మహేష్ కుమార్ 2019లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడలతో పాటు 2020లో మహబూబ్ నగర్లో జరిగిన స్కూల్ గేమ్ అఫ్ పెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించి వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్నాడు. ఇటీవల సేషనల్ స్టోర్స్ యూనివర్సీటీలో సీటు సాదించిన కాక జోగా రావు అనే తోటి విద్యార్ధితో రాక్ క్లైమింగ్లో శిక్షణ తీసుకున్న మహేష్ కుమార్ 10వ స్థానంలో నిలి చాడు. ఈ నెల 2,3,4 తేదీలలో సత్తుపల్లిలోని జెవి ఆర్ డిగ్రీ కళాశాలలో జరిగిన తెలంగాణ అండర్ ఆర్మ్ అండర్-19 రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీల లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుండి జాతీయ స్థాయి క్రీడలకు నలుగురు ఎంపిక కాగా వారిలో మహేష్ కుమార్తో పాటు సాయిరామ్ ఉన్నారు. దీంతో పా టు ఇదే నెలలో 8,9,10 తేదీలలో మెదక్ జిల్లాలోని చేగుంట బాలికల మోడల్ హైస్కూల్ జరిగిన రభ్బీ పోటీలకు మహేష్ కుమార్ కెప్టెన్ వ్యవ హరించగా సాయికుమార్ టీం సభ్యుడిగా పాల్గొ న్నాడు. సాయ కుమార్ 2018 సంవత్సరంలో భద్రా చలం పట్టణం లో జరిగిన జోనల్, రాష్ట్ర స్థాయి కోకో పోటీలతో పా టు, అదే సంవత్సరం కొత్తగూడెం పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్నాడు.
ప్రోత్సహిస్తే ప్రతిభను మరింత చాటుతాం : విద్యతో పాటు క్రీడల పట్ల తమకు ఉన్న మక్కువతోనే అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయిలో ఈ నెల 31వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో జరిగే అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు వెళుతున్నట్లు మహేష్ కుమార్, సాయిరామ్లు నవతెలంగాణకు తెలిపారు. తమది చాలా నిరుపేద గిరిజన కుటుంబం. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎంట్రీ ఫీజు, డ్రస్ కిట్, టీఏ, డీఏలతో పాటు అక్కడ తాము ప్రత్యేక బస చేసేందుకు సుమారు రూ.20 వేలకు పైన ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న తమను కొంత ఆర్దికంగా ప్రోత్సహిస్తే ఎజన్సీ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరుకు తీసుకు వచ్చి క్రీడల్లో తన సత్తాను మరింత చాటుతామని, మహేష్ కుమార్, సాయికుమార్లు నవతెలంగాణకు తెలిపారు. జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న గిరిజన విద్యార్దులను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నవతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కధనం.