Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అ ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ, మున్సిపాలిటీ చైర్మెన్లు
నవతెలంగాణ-ఇల్లందు
నియోజవకర్గవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు ఎంఎల్ఏ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మెన్ హరిసింగ్ నాయక్, మున్సిపాలిటీ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావులు తెలిపారు. నవతెలంగాణతో వారు మాట్లాడారు. కోవిడ్ ఎఫెక్ట్‌తో ప్రజలు ఇబ్బందులో ఉన్న మాట వాస్తవమే అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటోందన్నారు. ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందులో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రామలు, పేదల సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదన్నారు. ఇల్లందు, టేకులపల్లి, కామేపల్లి, బయ్యారం, గార్ల మండలలాలోని అనేక తండాలు, గ్రామాలలో రూ.కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు, డంప్ యార్డులు, మిషన్ భగీరధ ట్యాంకులు, పైప్లైన్లు, పార్కులు, చెరువుల అభివృద్ధి, ఆట స్ధలాలు, నర్సరీలు, హరితహారం, స్వర్గధామాలు ఇలా అనేకం చేపట్టామన్నారు. ఆస్తుల తగాదాలు, కబ్జాలు లేకుండా, రాకుండా ఉండటంకోసమే ధరణీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. బస్‌డిపో శంఖుస్ధాపన జరిగిందని త్వరలో పూర్తి కానుందని తెలిపారు. కూరగాయల మోడల్ మార్కెట్, ట్యాంకుబండ్, ఇండోర్ స్టేడియం తదిరాలు నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు కృషి జరుగుతోందన్నారు.