Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సినీ దర్శకులు, నటుడు ఆర్.నారాయణమూర్తి
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతు వ్యతిరేక నూతన సాగుచట్టాలు, వ్యవసాయ ప్రైవేటీకరణ, సంస్కరణల అంశాలతో తాను రూపొందించిన రైతన్న సినిమాకు కమ్యూనిస్టు పార్టీలు చూపిన ఆదరణ మరువలేనిదని రైతన్న సినిమా ధర్శకుడు, నిర్మాత, కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీపీఐఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ సామాజిక స్పృహతో నిర్మించిన చిత్రాలకు ఆదరణ కరువవుతోందని, ముఖ్యంగా యువత ఇలాంటి సినిమాల వల్ల ఆసక్తి చూపకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ గోవింద్, వర్కర్స్ యూనియన్ నాయకులు దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, జి.వీరస్వామి, వంగా వెంకట్, క్రిప్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట ఒకే దేశం-ఒకే చట్టం విధానంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయరంగానికే కాకుండా భారతావనికే విఘాతం కలిగిస్తుందని విప్లవ చలనచిత్రాల కధానాయకుడు, చిత్రనిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన తన ''రైతన్న'' చిత్రప్రచారంలో భాగంగా గురువారం అశ్వారావుపేట వచ్చిన సందర్భంగా స్థానిక కార్మిక సంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్వేచ్ఛా వాణిజ్యం, కార్పొరేటు వ్యవసాయ విధానం సాంకేతికంగా అభివృద్ధి అమెరికా లాంటి దేశాల్లో విజయవంతం అవుతుంది, కానీ సన్నచిన్న కారు రైతులు, కమతాల వ్యవసాయ పద్ధతి ఉన్న మన దేశానికి సరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు అమలు అయితే రైతే తన పొలంలో కూలీ మారే పరిస్థితి వస్తుందని తెలిపారు. స్వామినాధన్ సిఫార్సులు అమలు చేస్తే రైతులు లాభపడతారనే ఉద్దేశ్యంతోనే రాయితీలతో ప్రభుత్వాలు రైతులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు జరిగే నష్టమే ఈ ''రైతన్న'' చిత్రం ఇతివృత్తం అని తెలిపారు. ఆకలి తీర్చే ఆహార పంటల్నుపండించే ప్రతీ 'రైతన్న'' మనం అందరం ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, చిరంజీవి, సత్తుపల్లి నాయకులు మోరంపుడి పాండురంగారావు, ఎన్.డి నాయకులు రాములు పాల్గొన్నారు.