Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- బంధువులు ధర్నా : ఎంఎల్ఏ హామీతో విరమణ
నవతెలంగాణ-ఇల్లందు
దసరా పండుగ వేళ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఫైరింజన్ టూ వీలర్‌ను ఢ కొట్టిన ఘటనలో మహిళ అక్కడిక్కడే మృతి చెందగా భర్తకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన లకావత్ మంగి(37), బావ్ సింగ్(41) దంపతులు ద్విచక్రవాహనంపై ఇల్లందులో దసరా ఉత్సవాన్ని చూడడానికి వెళుతుండగా గోవింద్ సెంటర్లో ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్ వద్ద లారీ దిగబడడంతో రాంగ్ రూట్ లో వచ్చిన ఫైర్ ఇంజన్ ను తప్పించబోయి అదుపుతప్పి భార్యాభర్తలిద్దరు ప్రమాదానికి గురయినట్లు తెలిసింది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు కళాంజలి థియేటర్ సమీపంలో మృతురాలి కుటుంబ సభ్యులు రెండు గటంలపాటు ధర్నా చేశారు. ఎంఎల్ఏ హరిప్రియ సంఘటన స్ధలానికి చేరుకుని బాథిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.