Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి ఆలయం వద్ద జరిగే జాతరకు జనం పోటెత్తారు. కోవిడ్ అంక్షల మధ్య నిర్వహిస్తున్న శ్రీకోటమైసమ్మ జాతరకు జనం భారీగా తరలి వచ్చారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో అద్దంకి నాగేశ్వరారవు, ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాస శర్మలు వేదమంత్రాల మధ్య గుమ్మడి కాయ అర్పణం ద్వారా జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల కోసం దేవదాయశాఖా అన్ని ఏర్పాట్లను చేసింది. గంటకు ఒకసారి దర్శనాలకు బ్రేక్ ఇచ్చి ఆలయప్రాంగణాన్ని హైడ్రోక్లోరైట్తో ద్రావణంతో పిచికారి చేయించారు. జాతర ప్రాంగణంలో వైద్యాశాఖా ఆధ్వర్యంలో మెడికల్క్యాంపును ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలందజేసింది. సింగరేణి సీఐ తాటిపాముల సురేష్, కారేపల్లి కామేపల్లి ఎస్సై పీ.సురేష్, స్రవంతి ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.
సందడి చేసిన ఎమ్మెల్యేలు
జాతరకు శనివారం వచ్చిన వైరా, ఇల్లందు ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, బానోత్ హరిప్రియహర్సింగ్ నాయక్ లు క్రాస్ వీల్ ఎక్కి సందడి చేశారు. ముందుగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ దంపతులు క్రాస్ వీల్ ఎక్కగా అదే సమయంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ రావటంతో ఆయనను హర్సింగ్ నాయక్ మామా అంటూ అభివాదం చేసి క్రాస్ వీల్ ఎక్కవల్సిందిగా కోరారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ వీల్ ఎక్కి సందడి చేశారు. తుపాకిపట్టిన వైరా ఎమ్మెల్యే బూరలను కాల్చి ఉత్సహ పరిచారు. జాతర కలియతిరిగి భక్తులకు అభివాదం తెలుపుతూ ఉత్సహంగా గడిపారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ను హరిప్రియా-హర్సింగ్ దంపతులు శాలువతో సన్మానించగా, వైరా ఎమ్మెల్యే కూడా హరిప్రియా-హర్సింగ్ దంపతులను సన్మానించారు. అంతకు ముందు కోటమైసమ్మ ఆలయంలో వేరువేరుగా పూజలు చేశారు. వీరికి ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభిరామారావు, ఆలయ ప్రధాన ఆర్చకులు కొత్తలంక కైలాస శర్మలు ఎదురేగి మేళతాళ్లాలతో స్వాగతం ఫలికారు. ఎమ్మెల్యేల వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరు, వైస్ చైర్మన్ జానీ, వైరా ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, కారేపల్లి ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, సర్పంచ్ బానోత్ బన్సీలాల్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ గుగులోత్ శ్రీను, సంత ఆలయ చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు ఎంపీటీసీ బానోత్ రమేష్‌లు ఉన్నారు.
భారీగా వాహన పూజలు
జాతరలో వాహన పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది దీనిని దృష్టిలో ఉంచుకోని వాహన పూజలకోసం ప్రత్యేకంగా పురోహితులను ఏర్పాటు వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చింది. నూతన వాహనాలతో పాటు పాతవాహనాలకు పూజలకు తీసుకరావటంతో ఆలయ పరిసరాలు వాహనాలతో నిండి పోయాయి.