Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఐద్వా ఆధ్వర్యంలో 19 వార్డు రాజుపేటలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఐద్వా సీనియర్ నాయకురాలు అమరజీవి బండారు శ్రీదేవి జ్ఞాపకార్థం సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బిబిజీ తిలక్, వారి కుమారుడు అరుణ్ చంద్లు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా పట్టణ కార్యదర్శి మర్లపాటి రేణుక హాజరై మాట్లాడుతూ ఆడ పిల్లలు పుట్టాలి, ఎదగాలి, బతకాలి అనే నినాదంతో ఐద్వా ఈ సంబరాలు నిర్వహిస్తోందని ఆమె అన్నారు. దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలపై అత్యాచారాలను నివారించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందున్నాయని ఆమె విమర్శించారు. ప్రతి మహిళ చైతన్యవంతంగా ఎదగాలని, సమాజంలో మహిళల పట్ల జరుగుతు న్న వివక్షతపై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ అధ్యక్షులు డి.సీతా లక్ష్మి, ఐద్వా నాయకులు సుబ్బలక్ష్మి, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.బీ.నరసారెడ్డి, బి.వెంకట రెడ్డి, డి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.