Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
మండల కేంద్రమైన రఘునాథ పాలెం గ్రామపంచాయతీలో శనివారం మరణించిన బోసు బాబు మృతదేహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, మండల నాయకులతో కలిసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చువిజరు కుమార్, మద్దినేని వెంకటరమణ, మాజీ మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ఖమ్మం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి, కేతినేని హరిచంద్ర, కొండబాల కర్ణాకర్, అప్పారావు కృష్ణారావు, విజరు, రామారావు, గోపి శంకర్, తదితరులు నివాళులు అర్పించారు.