Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని ఆర్.నారాయణ మూర్తి శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు సాగు చట్టాల వలన వ్యవసాయం చేసే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో ప్రజలకు అర్థమయ్యేలా రూపొందించిన రైతన్న చిత్రాన్ని వీక్షించాలని వారిని ఆయన కోరారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు నారాయణ మూర్తిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యూత్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.