Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దసరా వేళ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
అ నిర్లక్ష్యంగా మిషన్ భగీరథ అధికారులు
అ అంతరాయం తొలగించాలి టీడీపీ నేత వంశీ
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణలోని మెయిన్ రోడ్డు గుండా మిషన్ భగీరథ కోసం గత రెండు నెలలుగా రోడ్లు తవ్వుతున్నారు. పైపులైన్లు వేసి, మట్టితో పూడ్చి వేశారు. దీంతో రోడ్లపై తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయి. తవ్వీన రోడ్డు మొత్తం పూర్తిగా పూరడ్చక పోవడంతో చాలా రోజులుగా ప్రయాణికులు, పెద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కొత్త బస్టాండ్ మూలమలుపులో దసరా పండుగ రోజు శుక్రవారం భారీ వాహనం గుంతలో దిగబడింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్డుకు అడ్డంగా భారీ వాహనం దిగబడటంతో ఒకే రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దసరా ఉత్సవాల వేదిక కూడా అదే రోడ్డు వెంట వెళ్లాల్సి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే రోజు ఒక ఫైర్ ఇంజన్ టు వీలర్‌పై వెళుతున్న దంపతులను ఢకొీట్టడంతో భార్య మృతి చెందింది. మిషన్ భగీరథ అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇల్లందు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముద్రగడ వంశీ మాట్లాడుతూ గుంతలపై మట్టి పోయడంతో రోడ్డు వేయక పోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. యుద్ధప్రాతిపదికన నూతన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.