Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సంప్రదాయబద్ధంగా శమీపూజ
అ రాములోరికి మహాపట్టాభిషేకం
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా శుక్రవారం శమీపూజ వైభవోపేతంగా నిర్వహిం చారు. ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను, స్వామి వారి ఆయుధాలను మేళతా ళాలతో దసరా మండపంకు తీసుకొచ్చారు. అనంత రం శమీ పూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఉదయం ఆరాధన ప్రక్రియలో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి అష్టోత్తర, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత శ్రీ సీతారామచంద్ర స్వామికి నిత్యకల్యాణం, శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ముందుగా నిత్య కల్యాణంను నిర్వహించి అనంతరం శ్రీరామాయణ పారాయణ సమాప్తిని పురస్కరించుకొని శ్రీ రామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్య హవచనం, కలశ స్థాపన, రామాయణంలోని పట్టాభిషేక ఘట్ట పారాయణం, కిరీటచారణ, కలశ జలాలతో స్వామి వారికి ప్రోక్షణ, వేదాశీర్వచనం, మంగళహారతి నిర్వహించారు. అదేవిధంగా దసరాను పురస్కరిం చుకొని పది రోజుల పాటు శ్రీమద్రారామాణ పారాయణం నిర్వహించారు. అలాగే చివరి రోజున పూర్ణాహుతి గావించారు.
సంప్రదాయంగా శమీపూజ..
శ్రీ సీతారామచంద్రస్వామికి మహారాజు అలంకారం చేసి భాజభజంత్రీలు, మేళతాళాలతో విజయోత్సవం, శమీ పూజ కోసం స్థానిక దసరా మండపం వద్దకు తీసుకొచ్చారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. తరువాత సంప్రోక్షణ నిర్వహించి షోడపోచారాతో శమీ వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుదర్శనం, ఖడ్గం, ధనస్సు, గధ తదితర ఆయుధాలకు పూజలు చేసి ఉద్వాసన పలికారు. చివరగా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరునకు ఆవాహనం చేసి బాణాలు సంధించారు. ఈ సందర్భంగా జమ్మి పత్రాలు అక్షింతలతో అర్చన చేసి చివరగా వాటిని భక్తుల శిరస్సుపై చల్లారు. అనంతరం శ్రీరామ లీలా మహౌత్సవాన్ని నిర్వహించగా వందలాది మంది భక్తులు తిలకించారు. ఈ సమయంలో రావణాసుర బొమ్మపై బాణాన్ని సంధించారు. అనంతరం స్వామి వారిని రామాలయంకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బి.శివాజీ దంపతులు, ఏఈఓ శ్రావణ్ కుమార్, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.