Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాల్వంచ సద్దుల బతుకమ్మ సందర్భంగా కేటీపీఎస్ కాలనీలోని రాధాకృష్ణ దేవాలయంలో బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ సాంప్రదాయ సిద్ధంగా బతుకమ్మను తీర్చిదిద్దిన మహిళామణులకు ఏ కాలనీ గణేష్ గ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి జర్నలిస్ట్ కాలనీలోనీ మహిళా మణులందరూ కలిసి తీర్చిదిద్దిన బతుకమ్మకు ద్వితీయ బహుమతి, అదే కాలనీకి చెందిన రాళ్లబండి రేణుకకు తృతీయ బహుమతి, కేటీపీఎస్ కాలనీకి చెందిన గడ్డం భవానికి అందజేశారు. బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం శుక్రవారం రాధాకృష్ణ దేవాలయంలో కమిటీ సభ్యులు అధ్యక్షులు వీరన్న, సెక్రెటరీ చెరుకు అశోక్, సర్దార్ సురేష్తో పాటు గండి నాగరాజు, రమేష్, వంశీ, రవి, అంజిలు విజేతలకు అందజేశారు.