Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జాతీయ క్రీడలకు వెళ్లేందుకు రూ.10 వేల నగదు అందజేత
అ నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ నెల 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో జరిగే అండర్ ఆర్మ్ జాతీయ క్రీడలకు వెళుతున్న సోయం మహేష్ కుమార్కు నందుల చెలక గ్రామ ఉద్యోగుల కమిటీ అండగా నిలిచింది. అదే గ్రామా నికి చెందిన ఆ విద్యార్ధికి మేము న్నాం అంటూ భరోసా కల్పించారు. ''ప్రతిభ..సత్తా చాటుతున్న గిరిజన విద్యార్ధులు ..ప్రోత్సహించండి అనే నవతెలంగాణ కథనానికి... స్పందించిన నందుల చెలక ఉద్యోగుల కమిటీ ఆ విద్యార్ధికి మనోధైర్యం కల్పించేలా శాలువాతో ఘనంగా సన్మానించారు. జాతీయ క్రీడలకు వెళ్లేందుకు ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు నగదు అందజేశారు. విద్యార్ధి మహేష్ కుమార్ మాట్లాడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ఉద్యోగుల కమిటీ, గ్రామస్తులు, తల్లి దండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాతీయ స్థాయి క్రీడల్లో తన ప్రతిభ చాటి గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకు వస్తానని తెలిపారు. విద్యార్ధిని సన్మానించిన వారిలో నందుల చెలక గ్రామ ఉద్యోగుల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సోయం కోటేశ్వరరావు, సోయం లకీëనారాయణ, ఉపాధ్యక్షులు సోడి శ్రీనివాసరావు, ముఖ్య సలహాదారు కారం గాంధీ, కొర్సా రాజేష్, సోడి శ్రీదేవి, తులసి, సంద్య, రత్నకుమారి, లతో పాటు విద్యార్ధులు తల్లి దండ్రులు ఉన్నారు.