Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్ వేణుగోపాల్ నడికుడి
నవతెలంగాణ-కొత్తగూడెం
బాధితునికి శస్త్ర చికిత్స చేయడంలో అనస్థీషియా ఒక భాగమై పోయిందని, ఇది లేకుండా ఆపరేషన్ చేయలేమని పట్టణంలోని సంకల్ప మల్టిస్పెషాలిటీ హాస్పటల్ ప్రముఖ కన్సలెంట్ అనస్థీషియాలజిస్ట్ (క్రిటికల్‌కేర్ అండ్ స్పెషలిస్తు) డాక్టర్ వేణుగోపాల్ నడికుడి అన్నారు. అకోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా శనివారం గణేష్ టెంపుల్ ఏరియాలోని సంకల్ప హాస్పటల్లో కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు. శస్త్రచికిత్సల తొలినాళ్లలో రోగికి ఎంతో బాధ ఉన్నప్పటికీ (మత్తు) అనస్థీషియా ఇవ్వకుండా ఆ శాస్త్రీయంగా శస్త్రచికిత్సలు చేసిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన వైద్యరంగంలో మత్తు (అనస్థీషియా) అనేది సరికొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. వైద్యరంగంలో ఆపరేషన్స్ ప్రక్రియకు అనస్థీషియా ప్రత్యేకత అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. 16 అక్టోబర్ 1846 ఈథర్ అనస్థీషియా రూపంలో అనస్థీషియా యూఎస్ఏ, న్యూయార్క్ నగరంలోని మస్యాచ్ సెట్స్ జనరల్ హాస్పిటల్లో జరిగిందని తెలిపారు. డాక్టర్ డబ్ల్యూటీజి మోర్టాన్ అనే వైద్యులు గిల్బర్ట్ అనే రోగికి ఈథర్ వాయువు ప్రయోగించి పేషేంట్‌కు ఎంటాంటి నొప్పిలేకుండా మెడమీద కణితిని తొలగించారు. ఆనాటి నుండి ఆపరేషన్స్‌లో ప్రక్రియలో అనస్థీషియా ప్రాముఖ్యత పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.