Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వాగతం పలికిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
నవతెలంగాణ-ఇల్లందు
ఉసిరికాయ పల్లి గ్రామంలో కొలువై ఉన్న కోట మైసమ్మ అమ్మవారి జాతర మహౌత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మెన్ పర్సా పట్టాభిరామయ్య ఆహ్వానం మేరకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ శనివారం ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మెన్ పర్సా పట్టాభి రామయ్య ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ దంపతులకు ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాములు నాయక్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులను గౌరవప్రదంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ఎమ్మెల్యేలు ఒకరి నొకరు సన్మానించుకోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులు జాతర వద్ద గల చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు పలు వస్తువులు చేయడమే కాకుండా వినోదం కోసం ఏర్పాటు చేసిన రంగులరాట్నం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దంపతులు, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు రాములు నాయక్ ఎక్కి జాతరలో కనువిందు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు దంపతులు, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాష, టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.