Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
గౌతమినగర్ కాలనీ ఈసీసీ స్టోర్స్ సేవలు అభినందనీయమని జీఎం సతీష్ కొనియాడారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సెక్రటరీ టీఎస్ పీ రవి కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్యాస్ డెలివరీ వాహనం ఆటో, సిలిండర్లు వెయింగ్ మెషీన్లకు ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనరల్ మేనేజర్, ఈసీసీ స్టోర్స్ ప్రెసిడెంట్ జి.సతీష్ హాజరై ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో అతిముఖ్యమైనది ఆయుధ పూజ ఒకటన్నారు. అనంతరం సెక్రటరీ రవి కుమార్ మాట్లాడుతూ..గ్యాస్ కోసం వచ్చే కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా ఎక్కడా లేని విధంగా డిజిటల్ సేవలో భాగంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎమ్ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచామని, గ్యాస్ బుకింగ్ చేసిన 12 గంటలలోపులో సిలిండర్లు డెలివరీ అయ్యేలా కృషి చేశామన్నారు. మేము పాటించే ప్రమాణాలు సేవలను గుర్తించిన హెచ్‌పీసీఎల్ అధికారుల ప్రశంసలు పొందామన్నారు. జీఎం సతీష్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం యు.శ్రీ.వివి ఉపాధ్యాయా డీజీఎంఈఎస్పీజేవీ సుధాకర్, సీఏఓవైఎస్ కాంబ్లీ, ఎక్స్ ప్రొడక్షన్ మేనేజర్, మేనేజ్ మెంట్ అధికార ప్రతినిధి వై.ఎస్.చక్రధర్, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.